GDWL: బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని గద్వాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం మల్దకల్ కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలకు బాలికల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిషేధం, విద్యా హక్కు చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం, జువైనల్ జస్టిస్ చట్టంపై అవగాహన కల్పించారు.