నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి నర్మదా యూరియా 2600 మెట్రిక్ టన్నులు పడుగుపాడు రైల్వే యాగిన్కి రావడం జరిగిందని ఏడీఏ అనిత తెలిపారు. ఈ సందర్భంగా యూరియాను ఆమె పరిశీలించారు. లారీల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించారు. నెల్లూరు జిల్లాకు 1780 మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు. రబీ సీజన్లో రైతులు నారుమూడులకు సిద్ధపడాలని ఎకరాకి మూడు బస్తాలు ఇస్తామన్నారు.