కోనసీమ: ఈనెల 17 వ తేదీన రాజోలులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన జరుగనుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ మహేష్ కుమార్ సోమవారం అధికారులతో కలెక్టరేట్లో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లె పండుగ 2.0 పనులు పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని, చనిపోయిన కొబ్బరి చెట్లను పరిశీలిస్తారని తెలిపారు.