ADB: ఆదివాసీలు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే గుస్సాడీ పండుగ సందడి ఆదివాసీ గ్రామాల్లో ప్రారంభమైంది. సొనాల మండలంలోని పార్డి(K) గ్రామంలో దీపావళి ముందు వచ్చే భోగి పండుగను జరుపుకున్నారు. ఈ రోజున ఆదివాసీ ఆడపడుచులు గుస్సాడీ టోపీలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.