KDP: భూ సమస్యల పరిష్కారం కొరకై నిరంతరం కృషిచేసి అర్హులైన వారికి న్యాయం చేస్తానని తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు తెలిపారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వ డీకేటి స్థలాలు అన్యాక్రాంతాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.