MDK: మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి 25 మంది బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్, మండల బీజేపీ అధ్యక్షుడు రాకేష్ తదితరులు ఉన్నారు.