MNCL: హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సోమవారం SI స్వరూప్ రాజ్ వివరాల ప్రకారం.. వెంకటేశ్- వాణి దంపతులు. వెంకటేశ్ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో పనికి వెళ్లి వచ్చి చూసే సరికి వాణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.