TG: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో తెలుగు రాజకీయ నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతాపం తెలిపారు.