TG: మేడారంలో ఇవాళ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్క పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మేడారం పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే.. మేడారం పనులపై మంత్రులు పొంగులేటి, సీతక్క సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.