KMR: విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు NPDCL ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్వో, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందన్నారు. అలాగే జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.