SRD: ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ డిమాండ్ చేశారు. నారాయణఖేడ్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు.