TG: మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అది తమ కుటుంబ సమస్య అని, సీఎం రేవంత్, తాను కూర్చుని సమస్యని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మంత్రుల మధ్య తలెత్తింది పెద్ద సమస్య కాదని అభిప్రాయపడ్డారు. కేవలం సమాచార లోపం వల్ల ఏర్పడిన సమస్య మాత్రమే అని స్పష్టం చేశారు.