KMM: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఆదివారం మధిరలో చోటు చేసుకుంది. మధిర రైల్వేహెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి కథనం ప్రకారం.. APకి చెందిన సుధాకర్ అనే వ్యక్తి మహబూబ్‌నగర్ నుంచి విశాఖపట్నంకు రైలులో వెళ్తుండగా మధిర సమీపంలో ప్రమాదవశాత్తు రైలులో నుంచి కింద పడ్డాడు. గాయపడిన సుధాకర్‌ను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.