BDK: చండ్రుగొండలోని పల్లె ప్రకృతి వనం ఖాళీ మందుసీసాలు, గ్లాసులతో స్వాగతం పలుకుతోంది. నిత్యం కొంతమంది మద్యం ప్రియులు దీనిని అడ్డాగా మార్చుకొని మద్యం సేవిస్తున్నారని స్థానికులు తెలిపారు. వనం గేటుకు తాళం లేకపోవడంతో ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని, వనం గేటుకు తాళం వేయించాలని కోరారు.