SRCL: ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన బొడ్డు మధును అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమయంలో పట్టుకున్నట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టరులో ఇసుక రవాణా చేస్తుండగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.