ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘AA 22’ ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి అట్లీ మాట్లాడారు. ‘ఏదైనా ఒక్క ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచం సృష్టిస్తున్నాం. త్వరలో మీరు దీన్ని ఆస్వాదిస్తారు’ అని తెలిపారు.