HYD: బాణాసంచా దుకాణాల నిర్వాహకులు భద్రత ప్రమాణాలు పాటించాలని డీసీపీ శిల్పవల్లి అన్నారు. శుక్రవారం బాణాసంచా దుకాణాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేవారు 15వ తేదీలోపు పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా దుకాణాల నిర్వహణ జాగ్రత్తలు చేపట్టాలన్నారు.