రోజు ఉదయం ఆ ఇంటి నుంచి 50-60 మందికి సరిపోయేంత టిఫిన్, టీ కావాలని ఆన్ లైన్ లో ఆర్డర్లు వస్తున్నాయి. రోజు నాలుగు సమయంలో భారీ ఆర్డర్లు రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల పాటు ఆ ఇంటిపై నిఘా ఉంచారు.
తెల్లవారుజామున ఆ భవనంలోకి భారీ ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్లు వస్తుంటాయి. అంత పొద్దుపొద్దున్నే దాదాపు 40-50 ఆర్డర్లు వస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఏం చేస్తున్నారో తెలియదు. డెలివరీ బాయ్ లు రావడం వచ్చి ఆర్డర్లు ఇచ్చి వెళ్లడం. రోజూ ఇలానే జరుగుతోంది. దీనిపై పోలీసులకు అనుమానమొచ్చింది. నిఘా పెట్టి వివరాలు తెలుసుకోగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. అవేంటో తెలుసుకోవడానికి చదవండి.
మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబైలో (Mumbai) రాజోడి బీచ్ (Rajodi Beach)కు సమీపంలో ఓ ఇల్లు ఉంది. రోజు ఉదయం ఆ ఇంటి నుంచి 50-60 మందికి సరిపోయేంత టిఫిన్, టీ కావాలని ఆన్ లైన్ లో ఆర్డర్లు వస్తున్నాయి. రోజు నాలుగు సమయంలో భారీ ఆర్డర్లు రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల పాటు ఆ ఇంటిపై నిఘా ఉంచారు. సోమవారం ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా.. నకిలీ కాల్ సెంటర్ (Fake Call Centre) నిర్వహణ వెలుగులోకి వచ్చింది. అందులో పని చేసేవారంతా ఫోన్ కాల్స్ తో ఆస్ట్రేలియాలోని (Australia) వినియోగదారుల బ్యాంకు వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ భవనంలో అప్పుడే చదువు పూర్తి చేసుకున్న టీనేజర్లు, 25 ఏళ్లలోపు వారిని పిలిచి టెలీ కాలింగ్ పై శిక్షణ ఇస్తున్నారు. అనంతరం ఆస్ట్రేలియాలోని వినియోగదారులను ఏమార్చి మోసాలకు పాల్పడుతున్నారు. వారి బ్యాంకింగ్ (Banking) వివరాలు సేకరించి ఓటీపీలు (OTPs) కాల్ సెంటర్ మేనేజర్లకు మెయిల్ ద్వారా పంపుతున్నారు. వాటి ద్వారా ఆస్ట్రేలియావాసులను మోసాలు చేస్తున్నట్లు తేలింది. ఆ భవనంపై దాడులు చేసి వారు వినియోగిస్తున్న కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.