VZM: ఎస్.కోట ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న నర్శింగ్, పారా మెడికల్ పోస్టులు భర్తీ చేయాలని MLC ఇందుకూరి రఘురాజు శాసన మండలిలో శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందేందుకు ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్దియాక్, న్యూరో, ఆర్థో విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.