టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. తొలి టెస్టులో సునాయాస విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. జోరు మీదున్న భారత జట్టుకు వెస్టిండీస్ ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి.