ప్రకాశం: తాళ్లూరు గ్రామాన్ని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు గురువారం సందర్శించారు. పారిశుద్ధ్య చర్యల తీరును ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడి తడి, పొడి చెత్త సేకరణకు సహకరించాలని కోరారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని, అందుకు ప్రజలు సైతం సహకరించాలన్నారు.