ATP: గుత్తి ప్రభుత్వాసుపత్రిలో గురువారం సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్ కార్యక్రమంపై ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎల్లప్ప మాట్లాడుతూ.. తగ్గించిన జీఎస్టీ మేరకు వస్తువులు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు మేలు జరుగుతుందన్నారు.