ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక కందుకూరు రోడ్డులోని డీవీ పార్కు వద్ద సాగర్ వాటర్ పైప్ లైన్ లీక్ అవ్వడంతో మీరు వృధాగా పోతుంది. ఈ విషయాన్ని స్థానికులు పంచాయతీ అధికారులకు తెలిపారు. ఇవాళ పంచాయతీ కార్యదర్శి అరవింద ఆధ్వర్యంలో పైప్ లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతవాసులు పంచాయితీ కార్యదర్శిని అభినందనలు తెలిపారు.