NTR: ప్రజల ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏపీలో పెద్దఎత్తున సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. విజయవాడ మండలంలోని గొల్లపూడిలో ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కింద 7 గురు లబ్ధిదారులకు రూ.11.95 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ లను (ఎల్.ఓ.సి) గురువారం అందజేశారు. ఈ క్రమంలో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.