ప్రకాశం: పామూరు మండలం పడమర కట్టకిందపల్లి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఇవాళ యూరియాను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కనిగిరి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ యారవ రమా శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూరియాపై వైసీపీ చేస్తున్నఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని, రైతులకి తగినంత యూరియా అందుబాటులో ఉందని, ఎవరు ఇబ్బందులు పడకుండా యురియాను అందజేస్తామని తెలిపారు.