గాజాలో యుద్ధ విరమణ ఒప్పందం కుదరడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు దోహదపడుతుందని ఆకాంక్షించారు. ఈ కీలక పరిణామం పట్ల మోదీ తన హర్షం వ్యక్తం చేశారు.