NRML: నిబంధనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎన్నికల కోడ్) పటిష్టంగా అమలు చేస్తామని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.