BHPL: జిల్లాలో మొదటి విడతలో 6 ZPTC, 58 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జడ్పీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.5,000, ఎంపీటీసీకి రూ.2,500 నామినేషన్ డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు జడ్పీటీసీకి రూ.2,500, ఎంపీటీసీకి రూ.1,250 డిపాజిట్ చెల్లించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.