MDK: జిల్లాలో మొదటి విడత 10 మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది. 10 ZPTC స్థానాలు, 99 MPTC స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. జిల్లాలోని పెద్ద శంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గం, పాపన్నపేట, టేక్మాల్, మెదక్, నిజాంపేట, హవేలీ గణపురం, చిన్న శంకరంపేట, రామాయంపేట మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు సిద్ధం చేశారు.