KDP: జిల్లాలో ఇద్దరు ఎంపీడీవోలను బదిలీ చేస్తూ జడ్పీ సీఈవో ఓబులమ్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒంటిమిట్ట ఎంపీడీవోగా కమలాపురంలో పనిచేస్తున్నషేక్ గౌస్ బాషాను, ఒంటిమిట్టలో విధులు నిర్వహిస్తున్నకే. సుజాతమ్మను కమలాపురం మండలానికి బదిలీ చేశారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటన ద్వారా తెలిపారు.