SRPT: యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. రోజుల తరబడి తిరుగుతున్నా బస్తా యూరియా అందక అవస్థలు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే మఠంపల్లి PACS వద్ద యూరియా కోసం రైతులు, మహిళలు క్యూలో వేచి ఉన్నారు. ఉదయం 9 గంటలకు కార్యాలయం తెరవగానే తోపులాట జరిగింది. రైతులు కొంత సమయం లైన్లో ఉన్న తర్వాత మళ్లీ తొక్కిసలాట జరిగింది.