మోహన్ బాబు ప్రైవేటు యూనివర్సీటిపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ భారీ జరిమానా విధించినట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని మంచు విష్ణు స్పష్టం చేశారు. యూనివర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఎవరో కావాలని తప్పుడూ ప్రచారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.