AP: పీపీపీ విధానంపై వైసీసీ వాదన అసంబద్ధం.. అవగాహనా రాహిత్యం అని టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ‘గత ఐదేళ్లు కేంద్రం సొమ్మును జగన్ దుర్వినియోగం చేశారు. ఇప్పుడు కూటమిప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. వైసీపీ నేతల కుట్రలతో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ఆగదు. క్యాంటమ్ వ్యాలీ, వివిధ భవనాల నిర్మాణం జోరుగా సాగుతోంది’ అని పేర్కొన్నారు.