AP: జగన్ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటనకు షరతులతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచించారు. జనసమీకరణకు అనుమతి లేదని తెలిపారు. ఎయిర్పోర్టు నుంచి వేపగుంట, పెందుర్తి జంక్షన్, సరిపల్లి మీదుకా పర్యటనకు అనుమతులు ఇచ్చారు. ఊరేగింపులు, సమావేశాలపై నిషేధం విధించినట్లు చెప్పారు. షరతులు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.