BDK: దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి పీఠ ప్రతిష్ట కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఎంతో భక్తి భావంతో నిర్మించిన అయ్యప్ప స్వామి పీఠం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.