TG: మంత్రి అడ్లూరిపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో మా ఇద్దరి మధ్య 20 ఏళ్ల స్నేహబంధం ఉంది. మా ఇద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. రాజకీయ దురుద్దేశంతోనే నా వ్యాఖ్యలను వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దీనివల్ల అడ్లూరి మనుసు నొచ్చుకుందని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నాను’ అని పేర్కొన్నారు.