ADB: మున్సిపాలిటీ అనుమతి లేకుండా రోడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేస్తం ఫౌండేషన్‌కు చెందిన వంశీ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిబంధనలను అతిక్రమించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. హెచ్చరిక బోర్డులు ఉన్నచోట ఎలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని తెలిపారు.