NLG: అడవిదేవులపల్లిలో రాత్రి కురిసిన గాలివానకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇవాళ ఉదయం అదే గ్రామానికి చెందిన దాసరి సైదయ్య, కల భిక్షం, రావుల దుర్గయ్య లకు చెందిన 4 గేదెలు మేతకు వెళ్లి సమీపంలోని అయ్యేరు కుంటలో నీరు తాగి వస్తుండగా ఆ విద్యుత్ తీగలకు తాగి విద్యుద్షాక్ గురై మృతిచెందాయి. దీంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.