ELR: ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ వెట్రిసెల్వి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలు, ఏడు కాండములతో కూడిన అద్భుత రామాయణాన్ని మానవాళికి అందించారని కలెక్టర్ కొనియాడారు.