PPM: స్వచ్ఛ ఆంధ్ర జిల్లాస్థాయి అవార్డుల కొరకు పార్వతీపురం బస్ డిపో ఎంపికైన సందర్బంగా బస్ స్టేషనులో పని చేస్తున్న పారిశుధ్య సిబ్బందికి డిపో మేనేజర్ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడంపై మరింత బాధ్యతలు పెరిగిందని చెప్పారు. బస్ స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.