AP: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘కూటమి ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోంది. జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది’ అంటూ మండిపడ్డారు.