HYD: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి బోధించిన మార్గాలు దేశప్రజలకు ఆదర్శమన్నారు.