పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘OG’ మూవీ హిట్ అందుకుంది. సెప్టెంబర్ 25న రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. థియేటర్లలో విడుదలైన 12 రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది. దీంతో ఈ ఏడాదిలో క్లీన్ హీట్ అందుకున్న 17వ మూవీగా ఇది నిలిచింది.