PDPL: సింగరేణి ఆర్జీ-2 డివిజన్ జీఎం కార్యాలయ ఆవరణలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం బండి వెంకటయ్య ముఖ్య అతిధిగా హాజరై వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. వాల్మీకి ఒక సామాన్యుడు మహర్షిగా మారి రామాయణం రచించారని, రామాయణంలో 24వేల శ్లోకాలు, ఏడు స్కందాలు ఉన్నట్లు గుర్తు చేశారు.