ట్రిపుల్ ఆర్తో వండర్స్ క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా రావాలంటే.. ఇంకా కనీసం రెండు, మూడేళ్ల సమయం పట్టనుంది. కానీ మరో సినిమా వల్ల బాయ్ కాట్ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది జక్కన్న. నెపోటిజం వల్ల ప్రస్తుతం బాలీవుడ్లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమాలన్నీ.. దాదాపుగా బాయ్ కాట్కే బలయ్యాయి. దానికి తోడు కంటెంట్ కూడా దారుణాతి దారుణంగా ఉండటంతో.. సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేదు బడా హీరోల సినిమాలు. ఇటీవల వచ్చిన అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’కు బాయ్ కాట్తో ఘోరంగా నెగెటివిటీ స్ప్రెడ్ అయింది. అంతేకాదు రీసెంట్గా వచ్చిన లైగర్‌ను.. కరణ్ జోహార్‌ను కారణంగా చూపిస్తు.. అదే విధంగా బాయ్ కాట్ చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే వచ్చే నెల సెప్టెంబర్ 9న, పాన్ ఇండియా స్థాయిలో ‘బ్రహ్మాస్త్ర’ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఇప్పుడు బాయ్ కాట్ ఎఫెక్ట్ ఈ సినిమా పై కూడా పడనుంది. అయితే ఇది బాలీవుడ్ మూవీ, అక్కడి వ్యవహారం కాబట్టి.. బాయ్ కాట్ కామన్ అనుకోవచ్చు. కానీ వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళిని బాయ్ కాట్ బ్యాచ్.. టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బ్రహ్మాస్త్ర సినిమా.. సౌత్‌లో రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. ఇప్పటికే మొదలైన ఈ సినిమా ప్రమోషన్లో రాజమౌళి కూడా పాల్గొంటున్నాడు. దాంతో రాజమౌళిని ఈ సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాలని అంటున్నాయి కొన్ని బీ టౌన్ వర్గాలు. అంతేకాదు రాజమోళిని బాయ్ కాట్ చెయ్యాలంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. దాంతో బ్రహ్మాస్త్ర వల్ల.. రాజమౌళి బాయ్ కాట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు రాజమౌళి అభిమానులు.