AP: విజయనగరం పైడితల్లి అమ్మవారి దర్శనంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనానికి కుటుంబసభ్యులతో వచ్చిన బొత్స.. బారికేడ్ తీసి ఎప్పటిలాగే నేరుగా ఆలయంలోకి పంపాలని పోలీసులను కోరారు. నేరుగా కాకుండా వేరే మార్గంలో రావాలని పోలీసులు సూచించారు. అలాగే, సిరిమానోత్సవం తిలకించే వేదిక మార్పుపై తర్వాత స్పందిస్తానని బొత్స తెలిపారు.