BPT: కల్తీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకుంది తమ కూటమి ప్రభుత్వమేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కల్తీ మద్యం మూలాలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ చుట్టే ఉన్నాయని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో కల్తీ మద్యం వల్ల 30వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జగన్ హయాంలోని స్కామ్‌ను తప్పుదారి పట్టించేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.