GNTR: తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు తమ విధులను బాయ్ కాట్ చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకరరావు తెలియజేశారు. సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్‌పై దాడిని నిరసిస్తూ తెనాలిలో మంగళవారం కోర్ట్ ప్రొసీడింగ్స్‌ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.