SRCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కోనరావుపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య కమ్యూనిటి హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.