HYD: అమెరికాలోని డల్లాస్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు చంద్రశేఖర్ మృతి చెందడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు రామచందర్ రావు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి డల్లాస్లో మృతి చెందడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.